PowerLifter Sadiya: టర్కీలో గతేడాది డిసెంబరులో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
మంగళవారం సీఎంను కలిసిన సాదియా తాను సాధించిన పతకాలు చూపించింది. ఈ సందర్భంగా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని వెల్లడించారు.