సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్ నిలిపివేత - గుంటూరు తాజా వార్తలు
గుంటూరు కొరిటెపాడులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి... ఆరు నెలలుగా విద్యుత్ బకాయిలు చెల్లించలేదు. విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయి... ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గుంటూరు జిల్లా కొరిటెపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో... నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. 6 నెలలు నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించలేదన్న కారణంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం లక్షా నలభై వేల నగదు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రకియ నిలిచిపోగా... కార్యాలయానికి వచ్చేవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి పనులు మానుకొని వస్తే... రిజిస్ట్రేషన్ జరగడం లేదని అధికారులు చెప్పగా అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.