లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసుల విధి నిర్వహణ ప్రశంసలకు పాత్రమవుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో వారు కఠినంగా వ్యవహరిస్తున్న తీరు బాధితులను ఇబ్బంది పెడుతోంది. అత్యవసర వైద్య సేవల కోసం కుటుంబసభ్యుడు ఒకరిని వెంటబెట్టుకొని యువతి కారులో ఆసుపత్రికి బయల్దేరారు. గుంటూరులోని ప్రధాన రహదారి అరండల్‌పేట- బ్రాడీపేట మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి కన్నీరుమున్నీరయ్యారు. వైద్యులు, ఇతరులు గమనించి రోగి పరిస్థితిని వివరిస్తూ పోలీసులను సముదాయించటంతో వాహనానికి దారినిచ్చారు.
రక్షకభటుడా.. వైద్యానికి వదులు బాట - Police stopped a young woman in Brodipet
లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న కృషికి పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు వ్యవహరిస్తున్న తీరు బాధితులను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి ఘటన గుంటూరులోని ప్రధాన రహదారి అరండల్‌పేట - బ్రాడీపేట మార్గంలో జరిగింది.
రక్షకభటా.. వైద్యానికి వదులు బాట