ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MISSING : బాలికలు అదృశ్యం... మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు - guntur crime

తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారులను గుంటూరు అర్బన్ పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం మూడు గంటల వ్యవధిలో కేసును ఛేదించిన సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్

By

Published : Sep 23, 2021, 1:17 AM IST

తమ పిల్లలు కనిపించడం లేదని గుంటూరు లాలాపేట పోలీస్​స్టేషన్​లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సాంకేతిక బృందం, కంట్రోల్ రూమ్, అన్ని పోలీస్​స్టేషన్ల పరిధిలో రాత్రి గస్తీలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కావటి రంగయ్య పాఠశాల ఆవరణలో తప్పిపోయిన ఇద్దరు బాలికలు ఉన్నట్లు గుర్తించారు. వారిని చేరదీసి, ఇంటి నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మూడు గంటల వ్యవధిలోనే బాలికల ఆచూకీ కనిపెట్టిన సిబ్బందిని అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details