తెలుగుదేశం అధినేత చంద్రబాబు 36గంటల నిరసన దీక్ష ప్రారంభమయ్యింది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యే బాబు దీక్షకు కూర్చున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8గంటలకు ప్రారంభంకావాల్సిన దీక్ష ఆలస్యంగా మొదలయ్యింది. ఆయన వెళుతున్న కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చారు. అదేసమయంలో సీఎం బయల్దేరడంతో మార్గం మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి వైపు కాకుండా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వాయ్ మళ్లించారు. దీంతో రూట్ మారడంతో 20నిమిషాలు ఆలస్యంగా చంద్రబాబు దీక్షాస్థలికి చేరుకున్నారు.
కాన్వాయ్ మార్గం మళ్లింపు.. ఆలస్యంగా ప్రారంభమైన చంద్రబాబు దీక్ష - సీఎం జగన్ పై చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు 36గంటల నిరసన దీక్ష ప్రారంభమయ్యింది. ఆయన వెళుతున్న కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చడంతో ఆలస్యంగా దీక్షాస్థలికి చేరుకున్నారు.

ఆలస్యంగా ప్రారంభమైన దీక్ష
చంద్రబాబు దీక్ష నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నేతలు,కార్యకర్తలు తరలివచ్చారు.
ఇదీ చదవండి : Chandrababu: వైకాపా దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష