ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్లపై యువకుల వేడుకలు.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు - గుంటూరులో రోడ్లపై సందడిచేస్తున్న యువతపై లాఠీ ఝళిపించిన పోలీసులు

నిషేదాజ్ఞలకు విరుద్ధంగా గుంటూరు యువకులు రోడ్లపై సందడి చేయగా.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. రోడ్లపై గుమికూడి వాహనాలను అడ్డుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్న కుర్రాళ్లను చెదరగొట్టి ఇంటికి పంపారు.

new year celebrations
గుంటూరులో యువత కోలాహలం

By

Published : Jan 1, 2021, 6:56 AM IST

గుంటూరులో యువత కోలాహలం

ఆనందోత్సాహాల మధ్య గుంటూరు నగర యువత కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అర్థరాత్రి దాటగానే వివిధ కూడళ్లలో కుర్రకారు గుమికూడి.. వచ్చేపోయే వాహనాలు ఆపుతూ శుభాకాంక్షలు తెలిపారు. రోడ్లపై నృత్యాలు చేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు.

నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రోడ్లపై సందడిచేసిన యువతపై.. పోలీసులు లాఠీ ఝళిపించారు. కొత్త ఏడాది బహిరంగ వేడుకలపై నిషేధం విధించినా కుర్రాళ్లు లెక్కచేయకపోవడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై గుమికూడిన వారి వాహనాలను కింద పడేసి.. కాళ్లతో తన్నారు. బలవంతంగా వారిని ఇళ్లకు పంపించి వేశారు.

ABOUT THE AUTHOR

...view details