సీపీఎం నేతల ర్యాలీ, అరెస్టు CPM leaders arrest: అమరావతిపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని.. ఆందోళనకు దిగిన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. నేతలను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి.. సీఆర్డీఏ కార్యాలయం వరకూ సీపీఎం నేతలు ర్యాలీగా వెళ్లారు.
కార్యాలయం లోపలికి వెళ్లనివ్వాలంటూ.. సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కానీ.. పోలీసులు అందుకు అనుమతించలేదు. ఈ క్రమంలో.. పోలీసులతో సీపీఎం నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Works on CPM leaders arrest: సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని... రాజధాని ప్రాంత రైతులు, కూలీలు తప్పుపట్టారు. సీపీఎం నాయకులతో కలిసి సీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా...వారిని పోలీసులు నిలిపివేశారు. తమకు గత ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేదని... ఇప్పుడు పెన్షన్ నిలిపివేశారని మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
టిడ్కో గృహాల కోసం రూ.50 వేల నుంచి లక్ష రూపాయల మేర కట్టించుకున్నారని.. ఇప్పటి వరకు ఇళ్లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు చెప్పుకుందామని వస్తే పోలీసులు అరెస్టు చేయడమేంటని మండిపడ్డారు.
ఇదీ చదవండి:ఆ దృష్టి మళ్లించేందుకే.. పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు: తెదేపా