ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్ - గుంటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఎన్​ఫోర్స్​​మెంట్ అధికారులు, పోలీసులు.. నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. పలు జిల్లాల్లో నాటుసారా తయారీని అడ్డుకుని.. బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి.. వారిపై కేసులు నమోదు చేశారు.

people arrested for making illegal transport of liquor all over the state
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

By

Published : Jun 4, 2021, 11:01 PM IST

రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం నెరుసు గూడెం తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు తనిఖీ చేశారు. తెలంగాణలోని అశ్వరావుపేట నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. నిడదవోలుకు చెందిన కర్రీబండి రెడ్డయ్య అనే వ్యక్తి.. ద్విచక్రవాహనంపై 27 మద్యం సీసాలు మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖలో

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వల్లూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడి చేశారు. 20 లీటర్ల నాటుసారా, 1250 లీటర్ల బెల్లం ఊటలను.. ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ సీఐ ఉపేంద్ర తెలిపారు.

గుంటూరులో

గుంటూరు జిల్లా తాడేపల్లిలో.. నిషేధిత గుట్కా, మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.10వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, 40మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ఫ్యూ సమయంలో.. అక్రమంగా మద్యం, గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

శ్రీకాకుళంలో

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తనిఖీ కేంద్రం వద్ద.. అక్రమంగా తరలిస్తున్న ఒడిశా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా పర్లాకిమిడి నుంచి మద్యం బాటిళ్లను లగేజీ ఆటోలో తరలిస్తుండగా.. పోలీసులు వాహన తనీఖీలు చేపట్టి.. నిందితులను పట్టుకున్నారు.

అనంతపురంలో

అనంతపురం జిల్లా మడకశిరలోని గుడిబండలో.. అక్రమ మద్యం, నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు చేశారు. బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ దారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మడకశిర మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ మద్యం నిర్వాహకులపై.. దాడులు నిర్వహించగా 175 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నిందితుల్లో ఓ వ్యక్తి పరారి కాగా ఇద్దరు పట్టుబడ్డారు. పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు.

గుంతకల్లునియోజకవర్గ వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై.. సెబ్, సివిల్ పోలీసుల అధ్వర్యంలో ముమ్మర దాడులు చేశారు. ఇందులో భాగంగా.. గుంతకల్లు, గుత్తి మండలాల్లో సుమారు 2400 లీటర్ల నాటు సారా, బెల్లం ఊటను ధ్వంసం చేసి, నాటుసారా అక్రమంగా నిల్వ ఉంచిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో.. నాటుసారా స్థావరాలపై పోలీసులు, సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2200 లీటర్ల బెల్లం ఊటసను ధ్వంసం చేశారు. 25 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని తగలబెట్టారు. పోలీసుల రాకను గమనించిన సారా తయారీ దారులు పరారయ్యారు. నిందితులను గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు

చిత్తూరులో

చిత్తూరు జిల్లాలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనీఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్రానికి వచ్చి, మద్యాన్ని వారి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 471 మద్యం బాటిళ్లు, 2.2 కిలోల గంజాయి, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి.. రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

Srivari temple: ఈ నెల 13న జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details