ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'3 రాజధానుల ప్రకటనతో రైతుల భవిష్యత్ అగమ్యగోచరం'

రాజధాని కోసం పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్​కల్యాణ్ స్పష్టం చేశారు. మందడంలో రైతులపై పెట్టిన కేసుల గురించి పవన్ స్పందించారు. 3 రాజధానుల ప్రకటనతో రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan says janasena supporting to Amaravathi Farmers
'3 రాజధానుల ప్రకటనతో రైతుల భవిష్యత్ అగమ్యగోచరం'

By

Published : Feb 20, 2020, 7:11 PM IST

మందడంలో రైతులపై పెట్టిన కేసుల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. రైతులపై కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన రైతులపై కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న పవన్‌... 3 రాజధానుల ప్రకటనతో రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలి రోజు నుంచి రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని వివరించారు. రైతులతో చర్చించకుండా కేసులు పెట్టడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాజధాని కోసం పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details