ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇసుక సరఫరా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం' - ఇసుక సరఫరాపై పవన్ వ్యాఖ్యలు తాజా వార్తలు

రాజకీయ లబ్ధి కోసం తాను మాట్లాడటం లేదనీ.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తామున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక సరఫరా విషయంలో కార్మికుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.

ఇసుక సరఫరాపై పవన్ స్పందన

By

Published : Oct 25, 2019, 1:39 PM IST

Updated : Oct 25, 2019, 2:29 PM IST

ఇసుక సరఫరాపై పవన్ స్పందన

ఇసుక సరఫరా ఆరోపణలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్​కల్యాణ్​ను ఇసుక ట్రాన్స్​పోర్టర్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన జనసేనాని... పనుల్లేక లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు బాధపడుతున్నారన్నారు. వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.

Last Updated : Oct 25, 2019, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details