ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్ - డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలన్న పవన్

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా... డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఆఖరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరి కాదన్నారు. మహారాష్ట్ర, ఒడిశా మాదిరిగా పరీక్షలు రద్దు చేయాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని పవన్ కోరారు.

డిగ్రీ, వృత్తి విద్యా పరీక్షలు రద్దు చేయండి : పవన్
డిగ్రీ, వృత్తి విద్యా పరీక్షలు రద్దు చేయండి : పవన్

By

Published : Jun 23, 2020, 2:01 PM IST

పవన్ ట్వీట్

రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో డిగ్రీతో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల ఆఖరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్న పవన్... ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదన్నారు. విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని కోరారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీతోపాటు ఎం.బి.ఎ, ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ., కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలన్నారు. విద్యార్థులంతా తమ కళాశాలలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, అక్కడ హాస్టళ్లలో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్లి రావడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.

పై చదువులకు వెళ్లేవారికి, క్యాంపస్ సెలెక్షన్స్​లో ఎంపికైన వారికి ధ్రువపత్రాలకు సమయం దగ్గరపడుతోందని... పరీక్షలు లేని కారణంగా పట్టాలు చేతికి రాలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని కోరారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయం గుర్తు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details