ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ రెండు పార్టీలు పొత్తులు కోరాయి: పవన్ - janasena]

వైకాపా ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని... ఆ తర్వాత స్పందిస్తామని జనసేనాని అన్నారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని కోరాయని చెప్పారు. జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మంగళగిరిలో సమావేశమయ్యారు.

చివరి రక్తం బొట్టు వరకు పార్టీని నడిపిస్తా: పవన్

By

Published : Jul 30, 2019, 5:23 PM IST

చివరి రక్తం బొట్టు వరకు పార్టీని నడిపిస్తా: పవన్

చివరి రక్తం బొట్టు వరకు పార్టీని నడిపిస్తానని జనసేనాని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసినవారినే నియోజకవర్గాల ఇన్ఛార్జ్ లుగా పవన్ నియమించారు. ఆయన సోదరుడు నాగబాబును సమన్వయ కమిటీకి ఛైర్మన్ గా నియమించారు. ఎన్నికల సమయంలో వైకాపా, తెదేపా నాయకులు పొత్తు కోసం తనను సంప్రదించారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేయడానికైనా సిద్ధమని కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఇసుక లేని కారణంగానే జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details