ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Guntur GGH: ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. కాలు పాడైపోయిందన్నా కనికరం చూపలేదు - గుంటూరు జీజీహెచ్​లో వైద్యం కోసం ఎదురుచూపులు

Guntur GGH: ప్రభుత్వాస్పత్రుల్లోని సిబ్బందికి రోగులంటే చిన్నచూపు. డాక్టర్లు వారికి నచ్చినప్పుడు రావడం,.. వచ్చినా రోగులను పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా మధుమేహంతో కాలు పాడైపోయి నడవలేని స్థితిలో వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్​కు వస్తే.. వైద్యులు లేరని ఉండటానికి బెడ్ ఇవ్వలేదు. తిరిగి వెళ్లలేక.. ఆరుబయటే పడిగాపులు గాస్తున్న వారిని చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

Guntur GGH
వైద్యం కోసం ఎదురుచూపులు

By

Published : May 4, 2022, 8:59 AM IST

Guntur GGH: బాపట్ల వైఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన రెడ్డయ్య కొన్నేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. వ్యాధితో ఇటీవల కాలు తీవ్రంగా దెబ్బతింది. ఈ స్థితిలో మంగళవారం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. ఆసుపత్రిలో సంప్రదించగా వైద్యులు లేరని, మూడు రోజుల తర్వాత రావాలని చెప్పారు. కాలు తీవ్రంగా దెబ్బతిని, దుర్వాసన వస్తున్నా కనీసం ప్రాథమిక వైద్యం కూడా చేయలేదు. ‘కాలు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. డాక్టర్‌ వచ్చేవరకు బెడ్‌ అయినా ఇవ్వమని ఎంత వేడుకున్నా సిబ్బంది కనికరించలేదు. నడవలేని స్థితిలో ఇంటికి వెళ్లలేక, ఆ కాలికి సంచి కప్పుకొని ఆసుపత్రి బయటే గడుపుతున్నాం’ అని రెడ్డయ్య భార్య శివకుమారి విలపించారు.

ఇదీ చదవండి:తెదేపా మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త దాడి.. అదే కారణమా ?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details