గుంటూరు నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా నగరపాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని పార్కులు, వాకింగ్ ట్రాక్లు, వ్యాయామ శాలలు, ఈత కొలనులు మూసివేయనున్నట్లు కమిషనర్ అనురాధ తెలిపారు. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలవుతుందన్నారు.
ప్రజలు ఎక్కువ సంఖ్యలో పార్కులకు వస్తున్నారని.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వైరస్ విస్తరిస్తోందని కమిషనర్ చెప్పారు. ప్రతిరోజూ జిల్లాలో నమోదయ్యే కేసుల్లో నగరాల్లోనే 50 శాతానికి పైగా ఉంటున్నాయని తెలిపారు. వైరస్ కట్టడి కోసం నిబంధనలు రూపొందించామని.. ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.