గుంటూరు కలెక్టరేట్ ఎదుట పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆమరణ దీక్షకు దిగారు. విదేశీ విద్య ఉపకార వేతనాలు ప్రభుత్వం మంజూరుచేయాలని డిమాండ్ చేస్తూ... కలెక్టరేట్ ఎదుట మూడోరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 24 రోజులు రిలే దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పిల్లలను విదేశాలకు పంపామన్న వారు.. ఇప్పుడు అర్ధంతరంగా విదేశీ విద్య ఉపకార వేతనాలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆమరణ దీక్ష! - గుంటూరు లేటెస్ట్ అప్డేట్స్
విదేశీ విద్య ఉపకార వేతనాలు అందించాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆమరణ దీక్ష చేపట్టారు. సీఎం జగన్ మాటలు నమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా ఉపకార వేతనాలు నిలిపివేశారని మండిపడ్డారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఆమరణ దీక్ష
Last Updated : Mar 30, 2022, 2:07 PM IST