పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పొన్నూరు మండలం వడ్డమానులో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న షేక్ హుస్సేన్.. గుంటూరులోని కృష్ణనగర్ కుందుల రోడ్డులోని వైట్‌హౌస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం అతని భార్య బ్యాంకుకు వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హుస్సేన్... ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకు నుంచి తిరిగివచ్చిన అతని భార్య.. భర్త మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పట్టాభిపురం పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పని ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య - గుంటూరు తాజా వార్తలు
గుంటూరులో ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఇతను.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

panchayat secretary commits suicide in guntur