గుంటూరు జిల్లా పల్లపాడులో జరిగిన గోపి అనే యువకుడి హత్య కేసును పోలీసులు(police chased murder case) ఛేదించారు. కులాంతర ప్రేమే(inter cast love) హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు(arrest) చేశారు. నిందితుల నుంచి 4 కత్తులు, కర్రలు, నైలాన్ తాళ్లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు(pallapadu) గ్రామానికి చెందిన గోపి(gopi).. అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు... గోపిని హెచ్చరించారు(warning). వారి మాటలను గోపి బేఖాతరు చేయడంతో దారుణంగా హత్య చేసినట్లు గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి(DSP jessy prashanthi) తెలిపారు. స్నేహితుల సహాయంతో గోపిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కర్రలతో దాడి(attack with sticks) చేశారు. తీవ్రంగా గాయపరిచిన అనంతరం అప్పాపురం కాల్వ(appapuram canal) వద్దకు తీసుకువెళ్లి, కత్తితో గొంతుకోసి హత్య చేశారని డీఎస్పీ(DSP) వెల్లడించారు. మృతదేహం(Dead body) బయటకు రాకుండా సంచిని రాళ్లతో కట్టేసి అప్పాపురం కాల్వలో పడేసినట్లు వివరించారు.