ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Paddy Seed Problems: నకిలి విత్తనాలతో మోసపోయామని.. రైతులు ఎం చేశారంటే..? - fake Paddy Seeds

Paddy Seed Problems: నకిలి వరి విత్తనాలతో మోసపోయామని రైతులు... గుంటూరు జిల్లా బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. సమారు 250 ఎకరాల్లో పంట సాగు చేసి నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ రైతులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Paddy Seed Problems
Paddy Seed Problems in guntur

By

Published : Dec 3, 2021, 10:49 PM IST

Paddy Seed Problems: గుంటూరు జిల్లాలో నకిలి వరి విత్తనాలతో మోసపోయామని రైతులు పోలీసుల్ని ఆశ్రయించారు. బాపట్ల మండలం మర్రిపూడి, పొన్నూరు మండలం చిన ఐటికంపాడు, నండూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు.. బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 'కల్లూరి సుబ్బారావు అనే వ్యాపారి వద్ద ఎంటీయూ 1224 రకం వరి విత్తనాలు కొనుగోలు చేశాం. 150రోజులకు పంట వస్తుందని చెప్పారు. అయితే 90 రోజులకే పంట కంకి వచ్చింది. అదే సమయంలో వర్షాలు రావటంతో పంట నేలకొరిగింది. కనీసం బస్తా కూడా రైతు చేతికి రాకుండా పూర్తిగా పాడైపోయింది' అని రైతులు వాపోయారు.

25కిలోల విత్తనానికి 980 రూపాయల చొప్పున చెల్లించారు. కేవలం సుబ్బారావు అనే వ్యాపారి వద్ద విత్తనాలు కొన్నవారు 250 ఎకరాల్లో సాగు చేశారు. వారందరి పంటా పాడైపోవటంతో వ్యాపారిని కలిసి పరిస్థితి వివరించారు. తాను నంద్యాల నుంచి విత్తనాలు తెప్పించినట్లు సదరు వ్యాపారి తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details