రైల్వే ప్రయాణికుల సౌకర్యాల కమిటీ గుంటూరు రైల్వే స్టేషన్ ను సందర్శించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటి స్టేషన్లో ప్రయాణికులకు ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలను పరిశీలించింది. ప్లాట్ ఫామ్ల శుభ్రత, ప్రయాణికులకు అవసరమైన బెంచీలు, వేచి ఉండేందుకు గదులు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలను వారు తనిఖీ చేశారు. గుంటూరు రైల్వే డివిజన్ అధికారులతో స్టేషన్లోని సౌకర్యాల గురించి ఆరా తీశారు. దేశంలోని అన్ని ముఖ్యమైన స్టేషన్లను తనిఖీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గుంటూరు జంక్షన్ లో కొన్ని అసౌకర్యాలను గుర్తించామన్నారు. వాటి గురించి రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చి ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని వారు తెలిపారు. కమిటీ సభ్యుల్లో భాజపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిర్మల కూడా ఉన్నారు.
రైల్యే ప్రయాణికుల సౌకర్యాల కమిటీ పర్యటన - గుంటూరు వార్తలు
గుంటూరు రైల్వే స్టేషన్ ను ప్రయాణికుల సౌకర్యాల కమిటీ సభ్యులు పరిశీలించారు. గుర్తించిన అసౌకర్యాలను రైల్వే బోర్డుకు నివేదించనున్నట్లు తెలిపారు.
రైల్యే ప్రయాణికుల సౌకర్యాల కమిటీ పర్యటన