ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో ఆక్సిజన్​ కంటైనర్ల నిల్వ కేంద్రం

సకాలంలో ఆక్సిజన్​ సరఫరాకు రవాణా ఆలస్యాలు, ఆటంకాలు ఏర్పడుతుండడంతో.. గుంటూరులో ఓ ఆక్సిజన్ కంటైనర్ నిల్వ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలో.. అవసరం మేరకు ఎక్కడికైనా వాటిని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

guntur jc on oxygen container storage
గుంటూరులో ఆక్సిజన్​ కంటైనర్ల నిల్వ కేంద్రం

By

Published : May 15, 2021, 2:34 PM IST

న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆక్సిజన్ కంటైనర్ నిల్వ కేంద్రాన్ని జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్కడ నిల్వ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

గుంటూరు నుంచి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు.. అవసరం మేరకు వీటిని తరలించనున్నారు. గుజరాత్ జామ్ నగర్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్లు ఇవాళ అర్ధరాత్రికి గుంటూరుకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లును జేసీ దినేష్ కుమార్, రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details