ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతున్న వేళ గుజరాత్ జామ్‌నగర్ నుంచి గుంటూరుకు 80 టన్నుల ఆక్సిజన్ కంటైనర్లు చేరుకున్నాయి. నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన ఆక్సిజన్‌ను అధికారుల పర్యవేక్షణలో వివిధ జిల్లాలకు సరఫరా చేపట్టారు.
రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు, కొవిడ్ ప్రత్యేకాధికారి ఆర్జా శ్రీకాంత్, గుంటూరు జేసీ దినేశ్ కుమార్ న్యూ గుంటూరులోని ఆక్సిజన్ పంపిణీ ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్రంలో 50 వేల పడకలకుగాను 30 వేల పడకలకు ఆక్సిజన్ అవసరమని.. రోజుకు 40 టన్నుల వరకు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని... వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని కృష్ణబాబు చెప్పారు.