ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉల్లి పాట్లు... ఇప్పట్లో తప్పేలా లేవు..! - గుంటూరులో ఉల్లి కష్టాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి కొరత కొనసాగుతోంది. కిలో ఉల్లి కోసం ప్రజలు రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి వరుసలో నిల్చున్నా... కొంతమందికి ఉల్లిపాయలు దొరకడంలేదు. గుంటూరు నగరం చుట్టుగుంట, పట్టాభిపురం రైతుబజార్ల వద్ద ఉల్లి సరఫరా చేస్తున్నా.. ప్రజల అవసరాల మేరకు అందడంలేదు. ఉల్లిపాయల కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

onion problems in gutur
గుంటూరులో ఉల్లి కష్టాలు

By

Published : Dec 11, 2019, 12:53 PM IST

ఉల్లి లేని వంటిల్లు వెలవెలబోతోంది. ఉల్లిపాయ లేని కూర రుచించడం లేదు. వీటి కోసం రైతుబజార్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం, సాయంత్రం రెండుపూటలా కౌంటర్ల వద్ద వరుసల్లో నిలబడుతున్నారు. కేజీ ఉల్లిపాయల కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. రైతుబజార్ల వద్ద క్యూలైన్లలో తరచూ తోపులాటలు జరుగుతున్నాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వస్తోంది. ఉల్లి సరఫరా సక్రమంగా జరగడం లేదని... కౌంటర్లు పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు నగరంలో పట్టాభిపురం, చుట్టుగుంట రైతుబజార్లలో ఉల్లి సరఫరా చేస్తున్నప్పటికీ.. అవి వినియోగదారుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఒక్కొక్కరికి కిలో చొప్పున ఇస్తున్నా.. క్యూలో ఉన్న అందరికీ రావడంలేదు. ముందుగా టోకెన్లు ఇస్తే గంటల తరబడి నిల్చునే పరిస్థితి తప్పుతుందని నగరవాసులు కోరుతున్నారు. రేషన్ డీలర్లను కానీ గ్రామస్థాయిలో వాలంటీర్ల సేవలు గానీ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

గుంటూరులో ఉల్లి కష్టాలు

ABOUT THE AUTHOR

...view details