ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సోకిందేమోనన్న భయంతో.. వృద్ధురాలు ఆత్మహత్య

కరోనా వచ్చి ప్రాణాలు గాల్లో కలిశాయనే వార్తలు మనం చూస్తున్నాం. కానీ... కరోనా వస్తుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలూ సైతం ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. మహమ్మారి అంతలా భయపెడుతోంది ప్రజలను. తాజా పాతగుంటూరు పరిధిలో 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా సోకిందేమోననే భయంతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

భయంతో వృద్ధురాలి ఆత్మహత్య
భయంతో వృద్ధురాలి ఆత్మహత్య

By

Published : May 8, 2021, 9:24 AM IST

కరోనా భయంతో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గుంటూరులో జరిగింది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం.. రెడ్లబజారుకు చెందిన దేవిరెడ్డి రమాదేవి (70) రెండు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడింది.

తనకు కరోనా సోకిందనే భయంతో గురువారం అర్ధరాత్రి జెండాచెట్టు సెంటర్​లోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు రమాదేవి మృతదేహాన్ని గుర్తించి పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details