దేశంలో కరోనా విలయతాండవం నేపథ్యంలో ఆక్సిజన్ అందక అనేక మంది చనిపోతున్న దుస్థితిని చూసి అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఆవేదన చెందారు. ఆ ఆవేదన నుంచి రాజమండ్రికి చెందిన ఫణికాంత్కు ఓ ఆలోచన వచ్చింది. ఆక్సిజన్ దొరక్క మృతిచెందుతున్న పేదలకు ఆక్సిజన్ అందించాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలోని తన స్నేహితులు.. మధు మాత్యు (కేరళ), మైథిలీ (హైదరాబాద్)కు విషయం చెప్పాడు. దీంతో అందరూ కలిసి సోషల్ మీడియా వేదికగా విరాళం కోసం సందేశాలు పెట్టారు.
280 ఆక్సిజన్ యంత్రాలను కొనుగులు
వీరి విజ్ఞప్తికి సేవాహృదయం కలిగిన చాలా మంది ఇచ్చిన విరాళాలతో రూ. 2 కోట్ల సేకరించారు. అ డబ్బుతో 280 ఆక్సిజన్ యంత్రాలు కొనుగులు చేసి ఇండియాకు పంపించారు. స్వదేశంలో ఆయా రాష్ట్రాల్లో సేవ చేయాలనుకునే స్నేహితులతో కలిసి ఆక్సిజన్ అవసరమున్న పేదవారికి సమకూర్చారు. అలా 13 రాష్ట్రాల్లో పేదలకు ఈ యంత్రాలు.. ప్రాణ వాయువును అందిస్తున్నాయి.