ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐదు కొవిడ్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు - corona hospitals in guntr

గుంటూరులో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఐదు కొవిడ్ ఆస్పత్రులకు సంయుక్త కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కొవిడ్‌ చికిత్సకు అనుమతించిన ఆసుపత్రులలో జిల్లా సంయుక్త కలెక్టర్‌, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

Guntur corona hospitals
Guntur corona hospitals

By

Published : Apr 24, 2021, 10:06 AM IST

గుంటూరులో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిన ఐదు ఆస్పత్రులకు సంయుక్త కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ షోకాజ్ నోటీసు ఇచ్చారు. నగరంలో కొవిడ్‌ చికిత్సకు అనుమతించిన ఆసుపత్రులలో జిల్లా సంయుక్త కలెక్టర్‌, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే కొవిడ్‌ బాధితులకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా వైద్యసేవలు అందించాలన్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవల్లో కానీ, ఫీజుల వసూళ్లలో కానీ ఇబ్బందుంటే కొవిడ్‌-19 కాల్‌సెంటర్‌, 104, స్పందన కాల్‌సెంటర్‌కు తెలియజేయవచ్చని వివేక్ యాదవ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details