పట్టుదల ఉంటే సాధించలేనిదేది లేదని నిరూపించారు చెన్నైకి చెందిన స్టానిస్ లాస్(90). ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తన చిన్న నాటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు నడుంబిగించారు. 90 ఏళ్ల వయసులో ఏపీ, తమిళనాడు మధ్య తిరుగుతూ న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా సాధించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం న్యాయవిభాగం అధ్యాపకురాలు డాక్టర్ శ్రీగౌరీ పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ స్పెషల్ డెత్ పెనాల్టీ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. ఈ పత్రానికి ఏఎన్యూ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది. తదుపరి ఎల్ఎల్డీ చేసేందుకు స్టానిస్ లాస్ ఆసక్తి చూపిస్తున్నారని శ్రీగౌరీ చెప్పారు.
90 ఏళ్ల వయసులో పీహెచ్డీ పూర్తి చేసిన చెన్నై వాసి - గుంటూరు జిల్లా వార్తలు
ఆయనకు చదువుపై ఉన్న ఆసక్తి...90 ఏళ్ల వయసులోనూ ముందుకు నడిపింది. చిన్న నాటి స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో శ్రమించారు. పీహెచ్డీ పట్టా సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

phd in nagarjuna university