గుంటూరు జీజీహెచ్‌లో పసికందు అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి సమయంలో నాలుగు రోజుల వయసున్న మగశిశువు అదృశ్యమయ్యాడు. పెదకాకానికి చెందిన ప్రియాంక, మహేశ్ దంపతులకు జన్మించిన మగశిశువు.. అమ్మమ్మ, తాతయ్య వద్ద పడుకుని ఉండగా గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉక్కపోతగా ఉందంటూ శిశువును తల్లి వద్ద నుంచి తీసుకెళ్లిన అమ్మమ్మ, తాతయ్య వరండాలో తమ వద్ద పడుకోబెట్టుకున్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగురోజుల పసికందు అదృశ్యం - latest news of guntur
09:43 October 16
newborn baby missing at guntur government hospital
ఆ తర్వాత కాసేపటికే.. శిశువు కనిపించలేదు. తల్లిదండ్రులు ప్రియాంక, మహేశ్ శిశువు కోసం వెతికినప్పటికీ జాడ కనిపించకపోవడంతో.. ఆసుపత్రి ఆధికారులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారమందుకున్న కొత్తపేట పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఆయితే.. సంచితో ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్న ఓ వ్యక్తి, అతని వెనుకాల వెళ్లిన మరో మహిళపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లవారు జామున ఆసుపత్రిలోని లేబర్ వార్డు రెండో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సీసీటీవీ వివరాలను పరిశీలిస్తూ పాత నేరస్థులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి.. ఆసుపత్రి వైద్యులతో సమావేశమై, శిశువు అదృశ్యంపై విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి:చీరాల బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి