గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు ఓ మాదిరిగా జరిగాయి. కరోనా వ్యాప్తి, పోలీసులు ఆంక్షలు మధ్య.. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలు చాలా సాదా సీదాగా ఉత్సవాలు చేసుకున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి.. క్రైస్తవులు ఏసును వేడుకున్నారు. ఈ ఏడాదైనా కొవిడ్ బాధలు తొలిగిపోవాలని కోరుకున్నారు.
సాదా సీదాగా గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు - సాదాసీదాగా గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు
ఏటా గుంటూరులో ఆర్భాటంగా జరిగే కొత్త సంవత్సర వేడుకలపై.. కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసి జరుపుకునే అవకాశం లేకుండా.. కొత్త రకం కొవిడ్, పోలీసుల ఆంక్షలు కట్టిపడేశాయి.
![సాదా సీదాగా గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు new year prayers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10076800-94-10076800-1609470252407.jpg)
నూతన సంవత్సర ప్రార్థనలు