new districts in ap: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుండటంతో అప్పటికల్లా ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు.
బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 6 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రధాన శాఖల కార్యాలయాల కోసం భవనాలు ముస్తాబవుతున్నాయి.
బాపట్ల కేంద్రంగా ఏర్పాటుకాబోతున్న కొత్త జిల్లా కోసం ఇప్పటికే అనేక భవనాలు గుర్తించాం.ప్రస్తుతం మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ ఎండ్ బీ విభాగం ఆధ్వర్యంలో భవనాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మరమ్మతులు చేయిస్తున్నాం.
స్థానికుల హర్షం : బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ఏర్పడనున్న మన్యం జిల్లాకు ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీడీఏ నూతన భవనంలో ఏర్పాటు కాబోతున్న కలెక్టరు, జేసీ, సీఈవో కార్యాలయాల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి. మరోవైపు...జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి :హిందూపురాన్ని జిల్లా కేంద్రం ప్రకటించాలని హైకోర్టులో పిల్