జిల్లాలో కొత్తగా 15 కంటెయిన్‌మెంట్ జోన్లు - new corona containment zones in gunturu district
జిల్లాలో కొత్తగా 15 ప్రాంతాలను కంటెయిన్ మెంట్ జోన్లను గుర్తించారు. ఈ మేరకు కలెక్టర్ శామ్యూల్ కుమార్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

గుంటూరు జిల్లాలో కొత్తగా 15 కంటెయిన్‌మెంట్ జోన్లను ప్రకటిస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని మంగళ్‌దాస్ నగర్, పట్టాభిపురం, స్వర్ణభారతినగర్, శారదాకాలనీ, గుంటూరువారితోట, చుండూరు మండలంలోని చినపరిమి, చెరుకుపల్లి మండలంలోని రాంబొట్లవారిపాలెం, కావూరు, చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి, రేపల్లె మండలంలోని మోర్లవారిపాలెం, బొబ్బర్లంక, కొల్లూరు మండలంలోని పెసర్లంక, బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి, అమరావతి మండలంలోని వాసవీసత్రం, నాదెండ్ల మండలంలోని సంకురాత్రిపాడు ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. మరోవైపు... కొవిడ్19 లాక్‌డౌన్ అనంతరం థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రానందున, జిల్లాలో థియేటర్లను తెరవవద్దని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు