గుంటూరు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసులు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 424 కేసులు నమోదయ్యాయి. గడిచిన 3 రోజుల్లో 1000కి పైగా కేసులు బయటపడ్డాయి. గుంటూరు నగర పరిధిలో 161, మంగళగిరిలో 52 కేసులు నమోదయ్యాయి. తెనాలి 42, నరసరావుపేట 24, కొల్లిపర 19, వేమూరు 12, తాడేపల్లి 11 మంది చొప్పున పాజిటివ్‌గా తెలింది.
తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 79,758కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 1755 క్రియాశీల కేసులున్నాయి. జిల్లా అధికారులు వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి కార్యాచరణ రూపొందించారు. 45 ఏళ్లు దాటిన వారికి అన్ని వార్డు, సచివలయాల్లో టీకా వేస్తున్నారు. కరోనా కట్టడి వ్యూహ్యంపై అధికారులతో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ సమీక్షించారు.