కొవిడ్ కేసుల తాకిడి నేపథ్యంలో ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని.. అవసరమైతేనే బయటకు రావాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అర్హులైనవారంతా తక్షణమే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. గుంటూరు కలెక్టరేట్లో కొవిడ్ నివారణ, నియంత్రణ చర్యలపై కలెక్టర్ వివేక్యాదవ్తో కలిసి హోంమంత్రి సుచరిత సమీక్షించారు. కేసులు పెరగడానికి ప్రజల్లో నిర్లక్ష్యమూ కారణమేనన్న హోంమంత్రి.. వివాహాలు, శుభకార్యాలు జరిగేటప్పుడు మరింత జాగ్రత్తతతో వ్యవహరించాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హోంమంత్రి హెచ్చరించారు.
కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమూ కారణమే: హోంమంత్రి - ap news
ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని హోంమంత్రి సుచరిత సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్లో కొవిడ్ నివారణ, నియంత్రణ చర్యలపై కలెక్టర్ వివేక్యాదవ్తో కలిసి హోంమంత్రి సుచరిత సమీక్షించారు.
హోంమంత్రి