అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బాధిత కుటుంబంపైనే కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుతో బాధితులకే వేధింపులు ఎదురవుతున్నాయని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు.
'కక్షసాధింపు రాజకీయాలతో.. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు'
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువుకి చెందిన తెదేపా కార్యకర్తపై వైకాపా నేతలు దాడిచేశారని... తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. దాడికి పాల్పడ్డవారిపై కాకుండా... బాధితులపై పోలీసులు కేసు పెట్టారని విమర్శించారు. జగన్ ట్రాప్లో పడి పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారని లోకేశ్ ఆక్షేపించారు. పోలీసులు తెదేపా కార్యకర్తపై మాట్లాడిన ఆడియోను లోకేశ్ ట్విటర్లో పెట్టారు.
'కక్షసాధింపు రాజకీయాలతో.. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు'
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువుకి చెందిన తెదేపా కార్యకర్త నాసరయ్య కుటుంబంపై వైకాపా నేతలు దాడి చేశారన్నారు. జగన్ ట్రాప్లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. తెదేపా కార్యకర్తతో పోలీసుల సంభాషణను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి :భాజపా నాయకుడు హీరోజీరావుపై గుర్తుతెలియని దుండగులు దాడి