ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Strange in Dundipalem: దుండిపాలెంలో వింత... పాలు తాగుతున్న నంది విగ్రహం - దుండిపాలెంలోని ఆలయంలో వింత

nandi idol drinking milk: దుండిపాలెంలో వింత చోటు చేసుకుంది. నంది నోటి వద్ద పాలు పెట్టగానే మాయమవుతున్నాయి. నందీశ్వరుడు పాలు తాగుతున్నాడంటూ ప్రచారం చేయడంతో భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

NANDI
పాలు తాగుతున్న నంది

By

Published : Mar 7, 2022, 12:24 PM IST

పాలు తాగుతున్న నంది

NANDI: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెంలో వింత చోటు చేసుకుంది. మల్లికార్జునస్వామి దేవస్థానంలోని నంది విగ్రహం పాలు తాగుతుందంటూ... భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నందీశ్వరుని విగ్రహానికి పాలు అందిస్తూ హారతులు ఇచ్చారు.

నంది నోటి వద్ద పాలు పెట్టగానే... పాలు మాయమవడంతో నందీశ్వరుడు పాలు తాగుతున్నాడంటూ భక్తులు ప్రచారం చేశారు. ఈ విషయం తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు నందికి పాలు పోయడానికి బారులు తీరారు. భక్తుల రాకతో గ్రామంలో కోలాహలం నెలకొంది. తమ గుడిలో ఇలాంటి అద్భుతం జరగడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details