ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు సలీంకు మెరుగైన వైద్యం అందించాలి: ముస్లిం సంఘాలు - Muslim unions protest at ggh for

పొలంలో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు సలీంకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Muslim union leaders protest at Guntur govt hospital
రైతు సలీంకు మెరుగైన వైద్యం అందించాలి

By

Published : Dec 22, 2020, 9:12 PM IST

పొలంలో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు సలీంకు గుంటూరు ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని... తక్షమే మెరుగైన వైద్యం అందించాలని ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కత్తి గాయాలతో సలీం మధ్యాహ్నం ఆసుపత్రికి వస్తే వైద్యం అందించకుండా కరోనా పరీక్షలు పేరుతో తాత్సారం చేస్తున్నారని మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు.

అణిచివేత పెరిగింది..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలను అణిచివేయడమే పనిగా పెట్టుకుందని ముస్లిం లీగ్ రాష్ట్ర నాయకులు బషీర్ అహ్మద్ అన్నారు. జగన్ ప్రభుత్వం నియంత పోకడలు మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు !

ABOUT THE AUTHOR

...view details