దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. గతంలో చేసిన పోరాటం ఫలితమే నేడు దివ్యాంగులకు రూ 3 వేల పెన్షన్లు వస్తున్నాయన్నారు. త్వరలో రూ. 6 వేలు చేయాలంటూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు.
దివ్యాంగుల సంక్షేమ శాఖకు దివ్యాంగులనే మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వారి సమస్యల కోసం జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని మంద కృష్ణ చెప్పారు.