శుక్రవారం(14-05-2021):
- నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లో అరెస్ట్
- ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని అభియోగం
- 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సీఐడీ
- హైదరాబాద్ నుంచి రఘురామను విజయవాడకు తరలింపు
- విజయవాడ నుంచి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలింపు
- ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరఫు న్యాయవాదులు
- రాష్ట్రంలో నెలకొన్న హైడ్రామా
- అర్ధరాత్రి వరకూ ఎంపీ రఘురామను విచారించిన సీఐడీ అధికారులు
శనివారం(15-05-2021):
- సీఐడీ కార్యాలయంలోనే ఎంపీకి జీజీహెచ్ వైద్య బృందంతో వైద్య పరీక్షలు
- బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకు హైకోర్టు సూచన
- జడ్జి ముందు ఎంపీని హాజరుపరిచిన పోలీసులు
- పోలీసులు తనను కొట్టారని జడ్జికి గాయాలు చూపి.. రాతపూర్వక ఫిర్యాదు
- కోలుకునే వరకూ రఘురామను ఆస్పత్రిలో ఉంచాలన్న కోర్టు
- 14 రోజుల రిమాండ్ విధిస్తూ సీఐడీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు
- రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై నివేదిక కోరిన కోర్టు
- జీజీహెచ్, రమేశ్ ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఆదేశాలు
- ఎంపీని కొట్టిన సంగతి, కమిలిపోయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో హైకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది ఆదినారాయణరావు.. అత్యవసర విచారణ జరిపిన న్యాయస్థానం
- ఎంపీ రఘురామ గాయాలపై వైద్య పరీక్షలకు ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటుకు న్యాయస్థానం ఆదేశాలు
- రాష్ట్రంలో ఏం జరుగుతోందని అదనపు ఏజీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించిన హైకోర్టు
- ఎంపీ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్
ఆదివారం(16-05-2021):
- వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును జీజీహెచ్‌కు తరలింపు
- రఘురామకు తగిలిన గాయాలపై.. మెడికల్ బోర్డు నివేదికలో జాప్యం
- మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో.. వైద్య పరీక్షలు పూర్తి చేసిన మెడికల్ బోర్డు
- రమేశ్ ఆసుపత్రిలో ఎంపీని చేర్చకుండా నేరుగా గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
- రఘురామకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక
- అక్కడి నుంచి హైకోర్టుకు నివేదిక.. విచారణ జరిపిన న్యాయస్థానం
- ఎంపీ రఘురామకృష్ణరాజుకు గాయాలు కాలేదని హైకోర్టుకు తెలిపిన మెడికల్ బోర్డు
- రఘరామను రమేశ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు
- వైద్య నివేదిక చూసి పూర్తి స్థాయి అఫిడవిట్ వేయాలని రఘురామ తరఫు న్యాయవాదికి తెలిపిన హైకోర్టు
- తన భర్తకు ప్రాణహాని ఉందని వీడియో విడుదల చేసిన ఎంపీ రఘురామ భార్య రమ
- కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఎంపీ రఘురామ కుమారుడు భరత్ లేఖ
- రఘురామ ప్రాణాన్ని కాపాడాలని.. రాష్ట్రపతికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
- ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా, సీపీఐ, జనసేన