11 ఏళ్ల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. తెదేపా హయాంలోనే నగరానికి రక్షితనీటి పథకం, భూగర్భ డ్రైనేజీ పథకం తెచ్చామని జయదేవ్ గుర్తు చేశారు. తెదేపా హయాంలో 50 శాతం యూజీడీ పనులు పూర్తి చేయగా.. వైకాపా ప్రభుత్వం వచ్చాక కొంచెం కూడా పనులు ముందుకు సాగలేదని జయదేవ్ ఆరోపించారు.
తెదేపాతోనే గుంటూరు నగరపాలక సంస్థకు పూర్వవైభవం: గల్లా - గుంటూరు నగరపాలక ఎన్నికలు ఎన్నికలు వార్తలు
గుంటూరు నగరపాలక సంస్థకు పూర్వవైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 3,8 వార్డుల్లో తెదేపా అభ్యర్థుల తరఫున జయదేవ్ ప్రచారం నిర్వహించారు.
![తెదేపాతోనే గుంటూరు నగరపాలక సంస్థకు పూర్వవైభవం: గల్లా mp jayadev campaign in gunturu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10811909-74-10811909-1614505737016.jpg)
mp jayadev campaign in gunturu