పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఓ తల్లి... రూ.75 వేలకు అమ్మేవేసిన ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు చంద్రయ్యనగర్లో నివాసం ఉంటున్న ఓ మహిళకు వివాహమై ఒక పాప, ఒక బాబు జన్మించారు. భర్తతో విభేదాలు వచ్చి ఇద్దరు విడిపోయారు. రెండు సంవత్సరాలుగా ఆమె తన అక్క వద్ద మిషన్ కుడుతూ జీవనం సాగిస్తుంది. ఆమెకు రాజు అనే టైలర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
9 రోజుల ఆడ శిశువును అమ్మేసిన తల్లి..! - గుంటూరు జిల్లా వార్తలు
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అంగట్లో అమ్మేసిందో తల్లి. కన్న బంధాన్ని మరిచి పొత్తిళ్లలోని బిడ్డను రూ.75 వేలకు విక్రయించింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమె ఈ నెల 11న ఓ మధ్యవర్తి సాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఓ పాపకు జన్మనిచ్చింది. 19వ తేదీ సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మధ్యవర్తి, టైలర్ రాజు, మరో మహిళ సహాయంతో 9 రోజులు వయసున్న ఆ పసికందును గుంటూరు అమరావతి రోడ్డులో ఓ వ్యక్తికి రూ.75 వేలకు విక్రయించారు. ఈ వివరాలు అన్ని ఆ వార్డులో పనిచేస్తున్న వాలంటీర్ గమనించారు. వెంటనే వాలంటీర్ చైల్డ్ హెల్ప్ లైన్ కార్యాలయానికి సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముద్దాయిల కోసం నాలుగు బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :కోతి-కుక్క పోరు...వానారానిదే పైచేయి