ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం, చట్టాల పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. కులవివక్షను నిరసిస్తూ రాజకీయాలకతీతంగా చైతన్యయాత్రను చేపట్టనున్నట్లు ఆయన గుంటూరులో స్పష్టం చేశారు.
'చట్టాల పట్ల అవగాహన పెంచేందుకు.. ప్రజా చైతన్యయాత్ర' - mlc dokka manikya varaprasad on sc st attrocity law
రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే అందుకు నిదర్శమని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో చట్టాల పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో ...రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
వివక్ష కొనసాగుతూనే ఉంది...
దళితులపై వివక్ష, దాడి ఘటనలను సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా ఖండించిందని...రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతూనే ఉందని డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం కులవివక్షను ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. కులవివక్ష, దాడులను నిరోధించేందుకు కొత్తప్రభుత్వం చర్యలు చేపట్టాలని... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి-తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!
TAGGED:
attrocity law