ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రబడ్జెట్ వల్ల వ్యాపారవర్గాలకే లబ్ధి: డొక్కా - guntur latest news

కేంద్ర బడ్జెట్ 2020-21 వ్యాపార వర్గాల వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉంది కానీ... పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి ఉపయోగం లేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

MLC Dokka comments on Budget
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్

By

Published : Feb 20, 2021, 3:59 PM IST

గుంటూరు అంబేడ్కర్ భవన్​లో 'దళిత గిరిజన కోణంలో కేంద్ర బడ్జెట్' అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ హజరయ్యారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్​ కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉందని డొక్కా అన్నారు.

బడ్జెట్​ని సవరణ చేసి దళిత గిరిజనులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరింత సాయం అందించాలన్నారు. దళిత గిరిజనులకు బడ్జెట్​లో జనాభా ప్రాతిపదికన సాయం అందించాలని... లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

జగన్‌కు పరిపాలనపై విజన్ లేదు: చింతామోహన్

ABOUT THE AUTHOR

...view details