MLA Undavalli Sridevi followers protest: గుంటూరు జిల్లా మేడికొండూరులో వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి అనుకూల వర్గాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాడికొండలో ఆగని ఆందోళనలు, ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల అరెస్ట్ - Latest News of Ap
MLA Undavalli Sridevi వైకాపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మేడికొండూరులో శ్రీదేవి అనుచరుల మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
డొక్కా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో.. సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని శ్రీదేవి అనుకూల వర్గం గుర్తు చేశారు. వరప్రసాద్‌ని ఇంచార్జ్‌గా నియమించడం వల్ల వైకాపాలో వర్గాలు ఏర్పడుతాయని అభిప్రాయపడ్డారు. డొక్కాను ఇంచార్జ్ బాధ్యత నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వేరే ఎవరైనా కొత్త వ్యక్తులను నియమించాలని అన్నారు. ఏ తప్పు లేకుండా నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: