మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే సీఐడీ నోటీసులు ఇచ్చారని.. దానిని తెదేపా నేతలు భూతద్దంలో చూపించి గగ్గోలు పెట్టడం సరికాదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తప్పు చేయలేదనే నమ్మకం బాబుకు ఉంటే సీఐడీ విచారణకు హాజరై తన సత్యశీలతను నిరూపించుకోవాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీల భూములను తెదేపా నేతలు అన్యాక్రాంతం చేశారని... ఈ స్కాంలో చంద్రబాబు డైరెక్టర్ అయితే.. లోకేష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారని విమర్శించారు.
'తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే.. విచారణలో నిరూపించుకోవాలి' - చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శలు
మాజీ సీఎం చంద్రబాబుకు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీఐడీ విచారణకు హాజరై తన సత్యశీలతను నిరూపించుకోవాలని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెదేపా నేతలు దళితలను మోసగించారని ఆమె పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
రాష్ట్ర ప్రజలంతా రాజధాని వికేంద్రీకరణ కోరుతున్నారని... దానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనమన్నారు. అభివృద్ధి జరిగే అమరావతి కావాలో.. అభివృద్ధి లేని అమరావతి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజధాని ప్రాంత ప్రజలు.. ధర్నాలు, ఉద్యమాలు ఆపేసి స్వచ్ఛందంగా ముందుకొస్తే అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.
ఇదీ చదవండి:సీఎం జగన్కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలి: హర్ష కుమార్