కూలీలతో కలిసి ఎమ్మెల్యే వరి కోశారు... భోజనం చేశారు... - news on mla rama krishna reddy
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న తన పొలంలో కూలీలతో పాటు వరి కోశారు.
![కూలీలతో కలిసి ఎమ్మెల్యే వరి కోశారు... భోజనం చేశారు... MLA rama krishna reddy harvest paddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5313014-362-5313014-1575861048639.jpg)
వరికొత కోసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత పనులపై దృష్టిపెట్టారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న తన పొలంలో ఆరు ఎకరాల్లో వరి వేశారు. ఆదివారం ఉదయం వర కొతకు ఉపక్రమించారు. కూలీలతో కలిసిఎమ్మెల్యే కోత కోశారు. మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని కూలీలతో కలిసి తిన్నారు.