గుంటూరులో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలి వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు స్ఫూర్తినిచ్చాయని మంత్రి అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలు మన ప్రాంతంలోనే ఉండటం గర్వకారణమన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, మద్య విమోచన కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి, మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం , పలువురు నాయకులు పాల్గొన్నారు.