గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో.. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను 15 రోజుల్లో గుర్తించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కాజ గ్రామంలో రియల్టర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించి అపార్టుమెంట్లు నిర్మించారని.. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.
ఇదీ చదవండి:టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా- మమత కోసమేనా?
ఆత్మకూరు వద్ద మంగళగిరికి అవసరమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని సిబ్బంది.. నగర పాలక సంస్థలో విలీనమై పనిచేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని సూచించారు. గ్రామస్థులకు కార్పొరేషన్ స్థాయి వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని నిర్దేశించారు.
ఇదీ చదవండి:
రోగుల సహాయకుల ఆకలి తీరుస్తున్న రెడ్ క్రాస్ సంస్థ