ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ.300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం: ఆళ్ల రామకృష్ణా రెడ్డి - Ramakrishna reddy review on under ground drainage

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్​ పరిధిలో రూ. 300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ(underground drainage system) నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో భూగర్భ డ్రైనేజీలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

mla Alla Ramakrishnareddy review
తాడేపల్లి కార్పొరేషన్​కు రూ. 300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ

By

Published : Sep 7, 2021, 10:22 PM IST

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్(Mangalagiri-Tadepalli Corporation) కార్యాలయంలో భూగర్భ డ్రైనేజీ, ప్రజారోగ్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్​ పరిధిలో వచ్చే నెలలో రూ. 300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ(underground drainage system) పనులు ప్రారంభించి.. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ రూ. 12వందల కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రూ.300కోట్లతో.. రాబోయే 50 ఏళ్లకు సరిపోయే భూగర్భ డ్రైనేజీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి, తాడేపల్లిలో 45(MLD)ఎంఎల్​డీల సామర్థ్యంతో రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళగిరి పట్టణ సుందరీకరణలో భాగంగా రెండు రహదారులను విస్తరిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details