ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BOY BODY TRACED: నిన్న గల్లంతు.. నేడు కాల్వలో బయటపడిన బాలుడి మృతదేహం! - guntur district news

గుంటూరు శివరాంనగర్ వద్ద కాల్వలో పడి గల్లంతైన బాలుడి ఘటన.. విషాదంగా ముగిసింది. బాలుడి మృతదేహం తెల్లవారు జామున బయటపడింది. నిన్నటి దాకా ఆడుకుంటూ కనిపించిన కుమారుడు కానరానిలోకాలకు వెళ్లాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

BOY BODY TRACED AT GUNTUR
కాల్వలో బయటపడ్డ బాలుడి మృతదేహం

By

Published : Jun 27, 2021, 2:22 PM IST

కాల్వలో బయటపడ్డ బాలుడి మృతదేహం

గుంటూరు మెడికల్ క్లబ్ పీకల వాగు వద్ద ఆడుకుంటూ కాల్వలో పడి గల్లంతైన బాలుడు వెంకటేష్ (5).. మరణించాడు. సంపత్​ నగర్ వద్ద ఉన్న కాలువలోకి బాలుడి మృతదేహం కొట్టుకొచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో బాలుడి మృతదేహం లభించినట్లు రుద్రా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు సుభాని తెలిపారు.

అర్ధరాత్రి వరకు జోరు వానలో వెతికినా.. ఆచూకీ దొరకలేదని, తెల్లవారుజాము నుంచి చేసిన ప్రయత్నంతో మృతదేహం లభించిందని చెప్పారు. నిన్నటి దాకా తమ ముందే ఆనందంగా ఆడుకుంటున్న కుమారుడు.. విగతజీవిగా కనిపించడంతో బాలుడి తల్లి మంగమ్మ కన్నీటి పర్యంతమైంది.

అసలేమైందంటే..

శనివారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. శివరాంనగర్ లో నివసించే పుల్లయ్త, మంగమ్మలకు ముగ్గురు సంతానంలోని.. రెండో కుమారుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. వరద నీటి ధాటికి బాలుడు కొట్టుకుపోవడంతో.. ఆచూకీ కోసం ఎన్టీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగింది. అయనా ఫలితం లేకుండా పోయింది. తెల్లవారుజామున సంపంత్ నగర్ వద్ద బాలుడు మృతదేహం బయటపడింది. ఆ తరువాత అధికారులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

'సైనికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం'

మద్యానికి డబ్బుల్లేక శానిటైజర్​ తాగి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details