కల్తీ విత్తనాలతో మోసపోయామంటూ గుంటూరు కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట మిర్చి రైతులు నిరసన చేపట్టారు. చేతిలో పూతరాలిన మిర్చి మొక్కలతో ఆందోళన చేపట్టారు. నాలుగు గ్రామాల్లోని 1,250 ఎకరాల్లో కల్తీ విత్తనాల మూలంగా పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
MIRCHI FARMERS: కల్తీ విత్తనాలతో నష్టపోయామంటూ రైతుల నిరసన
గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మిర్చి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కల్తీ విత్తనాలతో నష్టపోయామని.. తమను ఆదుకోవాలని జేసీకి వినతిపత్రం అందించారు.
మొక్క ఎదుగుదల లోపించిందని.. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనా అధికారులు పట్టించుకోలేదని అన్నదాతలు వాపోయారు. ప్రస్తుతం మూడు రకాల కల్తీ విత్తనాలు తమను నిండా ముంచాయని.. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. లక్ష చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా రైతులను అక్కడ నుంచి పోలీసులు తరలించే క్రమంలో ఓ రైతుకు స్వల్పంగా గాయమైంది. చివరకు జేసీకి తమ వినతిపత్రాన్ని అందించిన రైతులు.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీకేల్లో కొన్న విత్తనాలు కల్తీ కావడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:CHEATING CASE: జగతి పబ్లికేషన్స్ పేరిట యువకులకు టోకరా