ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 5, 2021, 5:02 PM IST

ETV Bharat / city

SWECHA PROGRAMME: ఏపీ విద్యావ్యవస్థలో 'స్వేచ్ఛ'.. దేశానికే ఆదర్శం: సుచరిత

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించేలా ప్రభుత్వం రూపొందించిన 'స్వేచ్ఛ' కార్యక్రమం దేశానికే ఆదర్శమని హోం మంత్రి కొనియాడారు. బాలికల విద్య కోసం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు.

swecha program
swecha program

ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించేలా ప్రభుత్వం రూపొందించిన 'స్వేచ్ఛ' కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలవనుందని ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత(HOME MINISTER SUCHARITA) అన్నారు. గుంటూరు స్తంభాలచెరువు పురపాలక పాఠశాలలో 'స్వేచ్ఛ' కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే ఆడపిల్లలు.. అక్కడ మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడం వల్ల డ్రాపౌట్ అయ్యేవారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న భరోసాతో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎంతగానో మారిందన్నారు. 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లోనూ బాలికలకు మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 'స్వేచ్ఛ' కార్యక్రమం ద్వారా ఏటా ప్రతి విద్యార్థినికి 120 శానిటరీ న్యాప్‌కిన్లను రాష్ట్రప్రభుత్వం అందించనుందని హోంమంత్రి తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా విద్యార్థినుల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM JAGAN) కృషి చేస్తున్నారని మంత్రి శంకర నారాయణ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ సన్నివేశాన్ని.. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఏపీ మోడల్ పాఠశాలలో మంత్రి శంకర నారాయణ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జడ్పీ చైర్మన్ గిరిజ వైకాపా శ్రేణులు పాల్గొని వీక్షించారు. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను కొనసాగించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ఇప్పటికే దిశా చట్టంతో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థులు స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా రూ. 30 కోట్ల నిధులు వేచ్చించామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులతో మంచి ఆశయాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఇదీ చదవండి:

సీఎం నివాసం సమీపంలో విశాఖ వాసుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details